ఇల్లు అమ్మకానికి లక్కీ డ్రా.. చీటింగ్ కేసు నమోదు..!

ఇల్లు అమ్మకానికి లక్కీ డ్రా.. చీటింగ్ కేసు నమోదు..!

ఖమ్మం జిల్లా జయనగర్ కాలనీలో ఓ ఇంటి యజమాని లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టాడు. అయితే ఇంటిని దక్కించుకోవాలంటే రూ. 250 కూపన్ కొనాల్సిన షరతు ఉన్నట్లు తెలిపాడు. కానీ ఈ లక్కీ డ్రా నిర్వహించడానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. డిసెంబర్ 25న లక్కీ డ్రా నిర్వహిస్తానని యజమాని ప్రకటించగా, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.