నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ELR: చింతలపూడి మండలం పంతంగులగూడెం గ్రామంలో సోమవారం ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన హాసవతు బిక్షాలు వద్ద లీటరు నాటు సారాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. సారాయి తయారు చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు చేపడతామని సీఐ హెచ్చరించారు.