నేడు ఢిల్లీకి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి బయలు దేరనున్నారు. రాత్రికి కడపలో నిర్వహిస్తున్న మహానాడు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. రేపు సీఐఐ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. రేపు రాత్రికి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరిగి అమరావతికి బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.