'ఆగస్టు 5న ధర్నాను జయప్రదం చేయండి'

NGKL: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని బుధవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు కొర్ర శంకర్ పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.