రేపు యాదగిరీశుడి చెంతకు అందగత్తెలు

BNR: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంతకు ఈ నెల 15న మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు స్వామివారిని దర్శించుకుంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.