కేసీఆర్‌పై రేవంత్ మరోసారి విమర్శలు

TG: కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టులు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తే ఇంజినీర్, డిజైనర్ అన్నీ ఆయనే అయి కాళేశ్వరం నిర్మించారని తెలిపారు. SLBC సొరంగం తవ్వకం పనులను గత ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోలేదని ఆరోపించారు. SLBCపై రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడితే నల్గొండ జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరు అందేదని చెప్పారు.