చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన తహసీల్దార్
కామారెడ్డి: మద్నూర్ మండలం సలబత్పూర్ వద్ద గల జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సివిల్ సప్లై చెక్ పోస్ట్‌ను తహసీల్దార్ ఎండీ ముజీబ్ శుక్రవారం తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం రాకుండా ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు