VIDEO: అలిపిరి వద్ద ఘోర అపచారం: భూమన

TPT: అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం జరుగుతోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మలమూత్రాలు, మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం పడి ఉండడాన్ని ఆయన గుర్తించారు. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరసగా అపచారాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సంఘటన ఉందన్నారు.