VIDEO: ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఘటనపై కలెక్టర్ విచారణ

VIDEO: ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఘటనపై కలెక్టర్ విచారణ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. వార్డెన్ భవానీ విద్యార్థినిని విచక్షణ రహితంగా కొట్టిన ఘటనపై సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విద్యార్థినీలను విచారించారు. ఈ ఘటనపై వార్డెను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.