'ఈనెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్'
ATP: ఈ నెల 5న ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం)కు తల్లిదండ్రులందరూ తప్పకుండా హాజరుకావాలని డీఈవో ప్రసాద్ బాబు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హాజరు, అభ్యసన తీరు, మార్కుల వివరాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అనధికార వ్యక్తులకు అనుమతి లేదని తెలిపారు.