'300 ప్రత్యేక బస్సులు సిద్ధం'
VSP: సింహాచలం చందనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు 300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖ ఆర్‌ఎం అప్పలనాయుడు తెలిపారు. కొండపై నుంచి గోశాలకు 50, అడివివరం వైపు 30 బస్సులు నడపనున్నారు. ద్వారకా, గాజువాక నుంచి 60, విజయనగరం, చోడవరం, కొత్తవలస నుంచి 50, అనకాపల్లి నుంచి 40 బస్సులు ఏర్పాటు చేశారు.