'వెంటనే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలి'
KNR: గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రూ.71 కోట్ల నిధులతో చేపట్టిన డబుల్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గుండ్లపల్లి చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. MLA కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.