అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ప్రభుత్వం: ధర్మాన

SKLM: YCP ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేసి నేతలను వేధించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ అరాచకానికి పాల్పడుతుందని EX Dy CM, YCP జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం జిల్లాలో ప్రకటన విడుదల చేశారు. కుట్రలో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని దుయ్యబట్టారు.