ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

Pdpl: శ్రీరాంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో కొందరు పిల్లలకు దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించి, వారిని జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు సిఫార్సు చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి జిల్లా వైద్యశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు.