'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'
ప్రకాశం: గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని పామూరు ఎంపీడీవో ఎల్ బ్రహ్మయ్య అన్నారు. బుధవారం పామూరు మండలంలోని నిచ్చుపొద గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సచివాలయానికి వచ్చే ప్రజలకు వారి సమస్యని తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా సిబ్బంది పనిచేయాలన్నారు. అనంతరం సర్టిఫికెట్ల జారి విషయంలో అలసత్వం వహించవద్దు అని పేర్కొన్నారు.