ఎంపీకి క్యాన్సర్ స్క్రీనింగ్ సిబ్బంది వినతి
CTR: రేణిగుంట విమానాశ్రయంలో చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాదరావును స్విమ్స్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సిబ్బంది శుక్రవారం కలిశారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి 22 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిందని, తమను కాంట్రాక్ట్ విధానంలో కొనసాగించాలని ఆయనకు వినతిపత్రం అందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.