భగవంతుడు ఎంతో అమ్మ అంతే: చాగంటి

భగవంతుడు ఎంతో అమ్మ అంతే: చాగంటి

AP: జీవితంలో అన్నిటికంటే పెద్ద నేరం అమ్మకు చెప్పలేం అన్న పని చేయడమేనని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. 'ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. భగవంతుడు ఎంతో అమ్మ అంతే. మహాత్ములైన ఎవరి జీవిత చరిత్ర పరిశీలించిన అమ్మకు సమస్కారం చేయకుండా, ఆమె గొప్పతనం చెప్పకుండా లేరు. టంగుటూరి ప్రకాశం పంతులు తన జీవిత చరిత్రలో అమ్మ గురించి చెప్పారు' అని తెలిపారు.