కనుల విందుగా శ్రీ రాముల వారి కళ్యాణం

కడప: చిట్వేలి మండల పరిధిలోని రాజుకుంట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం గ్రామస్తులంతా కలిసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులు విందుగా నిర్వహించారు. వేద పండితులు సుబ్బు శర్మ వేదమంత్రాలతో కళ్యాణ ఘట్టాన్ని వివరించగా భక్తులంతా ఆసక్తితో తిలకించారు. మధ్యాహ్నం భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు.