'అంగన్వాడీ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలి'

'అంగన్వాడీ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలి'

BDK: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందించాలని DMHO డా.భాస్కర్ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం PHC వైద్యులు, ANM, ఆశాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులలో దృష్టి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అధికారులు సహకరించాలని అన్నారు.