అనపర్తిలో జాతీయ జెండాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనపర్తిలోని ప్రతి ఇంటిపై, దుకాణంపై జాతీయ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్‌లో కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణానికి వెళ్లి జాతీయ పతాకాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మెయిన్ రోడ్‌లో ర్యాలీ చేపట్టారు.