మహిళతో అసభ్యప్రవర్తన.. సీఐ సస్పెండ్

సత్యసాయి: మడకశిర ఆప్ గ్రేడ్ సిఐగా పని చేస్తున్న రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ, ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారని వచ్చిన పలు ఆరోపణలపై విఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సిఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.