ఓట్ల కోసం ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ

ఓట్ల కోసం ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ

TG: సర్పంచ్‌ అభ్యర్థులు వినూత్న ప్రచారం చేశారు. హనుమకొండ జిల్లా నేరెళ్లలో కోతుల బెడద ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడి సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించారు. తమను గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.