ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే

KKD: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూశామని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం పెద్దాపురంలో టీడీపీ సూపర్ సిక్స్ విజయోత్సవ సభ, నియోజకవర్గ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.