గుంటూరులో రూ.1.46 కోట్లతో అభివృద్ధి పనులు: నసీర్
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మద్దిరాల కాలనీ, గణేశ్ నగర్, మంగళ్‌దాస్‌నగర్ ప్రాంతాల్లో రూ. 1.46 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ సోమవారం శంకుస్థాపన చేశారు. గత పాలకులు ఈ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లోనూ అభివృద్ధి చేశామన్నారు.