'విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'

'విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'

MBNR: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ అప్పయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల‌లో నిర్వహించిన నష ముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరైన ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.