బూర్జలో ఉచిత పశువైద్య శిబిరం
ASR: హుకుంపేట(M) బూర్జ పంచాయతీలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఉప్ప పశువైద్య అధికారి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో బూర్జ, జాకరవలసకాలని, తుంబవలస, వచనరంగిని గ్రామాల నుంచి సుమారు 360 పశువులకు చికిత్స, టీకాలు వేశారు. పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. వ్యాధి సోకిన పశువులను 28 రోజులు ఐసోలేట్ చేయాలన్నారు.