సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచాలి: ఎస్సై
VKB: వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ధరూర్ ఎస్సై రాఘవేందర్ కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా నిండిన కుంటలు, చెరువుల వద్ద ఈతకు వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తల్లితండ్రులకు సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలని ఆయన కోరారు.