VIDEO: ఇసుక తరలింపుపై ఎద్దుల బండి యజమానుల ధర్నా
GDWL: టిప్పర్లలో రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, జీవనోపాధి కోసం ఎద్దుల బండిపై ఇసుక తెచ్చుకుంటే మాత్రం అడ్డుకోవడం అన్యాయమని ఎద్దుల బండి యజమానులు మండిపడ్డారు. రాజోలి సెంటర్‌లో ఆదివారం వారు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. భారీ వాహనాలపై కేసులు పెట్టకుండా, తమపై చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.