నేరాలను ఛేదించేందుకే సీసీటీవీలు ఏర్పాటు: ఎస్పీ

నేరాలను ఛేదించేందుకే సీసీటీవీలు ఏర్పాటు: ఎస్పీ

ADB: నేరాల నియంత్రణ అరికట్టడానికి ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాలలో 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఏఎస్పీ కాజల్ సింగ్ సిబ్బందితో కలిసి సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కెమెరాలు అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయన్నారు. రాత్రి, పగటి సమయంలో తేడా లేకుండా సరైన స్పష్టమైన దృశ్యాలను అందిస్తాయని వారు తెలిపారు.