VIDEO: భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ వాసవి మాత దేవాలయం 30వ వార్షికోత్సవ ముగింపు సందర్భంగా పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆర్యవైశ్య భక్తులు భజనలు, భక్తిపాటలు, కోలాటాలతో నృత్యాలు చేస్తూ భారీగా పాల్గొన్నారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో చేరి శోభాయాత్రను విజయవంతం చేశారు. ఈ అందమైన వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.