VIDEO: ముంబైలో ఆఫ్రికన్ మహిళ వీరంగం
ఇండిగో విమానాల రద్దుపై తీవ్ర ఆగ్రహం, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆఫ్రికన్ మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇండిగో విమానయాన సంస్థ కౌంటర్ పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. సిబ్బందితో అరుస్తూ తీవ్ర విమర్శలు చేసింది. వారు సరైన సమాధానం చెప్పలేదని అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.