ఘనంగా కోడెల వర్ధంతి

GNTR: నవ్యాంధ్ర తొలి శాసన సభాపతి డా. కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ డా. కోడెల శివప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవలో ఆయన చూపిన కృషి అందరికీ ఆదర్శమని అన్నారు.