చింతల వెంకటరమణ స్వామికి తిరుమంజనం

చింతల వెంకటరమణ స్వామికి తిరుమంజనం

ATP: తాడిపత్రిలోని ప్రముఖ శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో మంగళవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారికి తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. పవిత్ర జలాలతో, పాలు, పెరుగు, పండ్లు, ఇతర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.