CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. పట్టణ, మండల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,74,726ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.