'లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి'

'లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి'

NZB: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువులో రాణించాలని పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య సూచించారు. 'దీన్ దయాళ్ స్పర్శ్ యోజన'కు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటూ, సెల్‌ఫోన్‌ను కేవలం విద్యావసరాలకే ఉపయోగించుకోవాలని హితవు పలికారు. పోటీ పరీక్షలు రాయడం వల్ల జ్ఞానం పెరుగుతుందన్నారు.