విక్టోరియా గార్డెన్ వద్ద దారుణ హత్య

విక్టోరియా గార్డెన్ వద్ద దారుణ హత్య

NLR: నగరంలోని మూలపేట అలంకార్ సెంటర్ సమీపంలోని విక్టోరియా గార్డెన్ వద్ద లైక్ అనే యువకుడు బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. లైక్, నూర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాదం నెలకొంది. లైకును నూర్ వెంబడించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సీఐ చిట్టెం కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.