'మత్తు పదార్థాల వల్ల జీవితాలు నాశనం'
ASR: చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, బాగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మంప ఎస్సై శ్రీనివాస్‌తో కలిసి కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల-1ని సందర్శించి, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు.