సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు

SKLM: అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దర్శించుకున్నారు. బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావుతో పాటు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జ్ఞాపికను మాధవ్‌కు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అందజేశారు.