'ఆపరేషన్ పోలో'.. ముఖ్య పాత్ర పోషించిన సర్దార్
HYD: స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యతలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య పాత్ర పోషించారు. 1947లో 565 సంస్థనాల్లో J&K, జునాగడ్, HYD మినహా మిగిలినవి భారత యూనియన్‌లో విలీనమయ్యాయి. HYDను స్వతంత్రంగా ఉంచాలని నిజాం ప్రయత్నాలు, రజాకార్ల అల్లర్ల వల్ల 1948 SEP 13న ఆయన చతురతతో భారత సైన్యం 'ఆపరేషన్ పోలో' ప్రారంభించగా, SEP 17న నిజాం లొంగిపోయి, HYD భారత్‌లో విలీనమైంది.