ఈ జిల్లాల ప్రజలకు BIG ALERT
AP: నైరుతి బంగాళఖాతంలో ఉత్తర దిశగా దిత్వా తుఫాన్ ప్రయాణిస్తుంది. పుదుచ్చేరికి 110 కి.మీ, చెన్నైకి 180 కి.మీ దూరంలో దిత్వా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో తుఫాన్ కదిలింది. ఇవాళ అర్థరాత్రికి దిత్వా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.