త్రాగు నీటిని క్లోరినేషన్ చేశాకే సరఫరా చేయాలి: MPDO

VZM: త్రాగు నీటిని క్లోరినేషన్ చేసిన తర్వాతే సరఫరా చేయాలని బొబ్బిలి MPDO పి. రవికుమార్ సూచించారు. ఇవాళ స్థానిక కృష్ణాపురంలో త్రాగు నీటి సరఫరాను, క్లోరినేషన్ విధానాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని పంచాయతీ కార్యదర్శి రవికి ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.