VIDEO: వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి: ఎస్సై
WNP: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని వనపర్తి ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర అన్నారు. వనపర్తి శివారులోని నాగవరం వద్ద సోమవారం ట్రాఫిక్ ఎస్సై సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులకు ఫైన్ వేశారు.