'స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి'
ADB: ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లోని TTDC భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కష్టపడి నేర్చుకుంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని అన్నారు.