హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

ADB: నేరడిగొండ మండలంలోని కుస్టీ హైవేలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దిలీప్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దిలీప్ రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.