FASTag లేకపోతే UPI బెస్ట్!
జాతీయ రహదారి టోల్ వసూళ్లలో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. ఈనెల 15 నుంచి FASTag లేకపోతే జరిమానా విధించనున్నారు. నగదుతో చెల్లిస్తే రెట్టింపు (రూ.100 బదులు రూ.200) కట్టాలి. అలాకాకుండా UPI/డిజిటల్ ద్వారా కట్టాలనుకుంటే టోల్ రుసుము 1.25 రెట్లు (రూ.100కి బదులు రూ.125) మాత్రమే చెల్లించాలి. ఈ సవరణతో డిజిటల్ చెల్లింపుదారులకు కొంత ఊరట లభించింది.