VIDEO: గుడ్డం కోనేరు అభివృద్ధికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: హిందూపురంలో గుడ్డం కోనేరుకు అహుడా నుంచి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. శుక్రవారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుడ్డం కోనేరు అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం అప్పుడు కోనేరు పరిస్థితి సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గుడ్డం కోనేరు అభివృద్ధికి సహకరించిన MLAకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.