'పోలీసు అంటే భయం కాదు.. నమ్మకం కలిగేలా వ్యవహరించాలి'
అన్నమయ్య: పోలీసు అంటే భయం కాదు, నమ్మకం కలిగేలా వ్యవహరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. ఇందులో భాగంగా రాయచోటిలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తప్పిపోయిన వారి కేసులు, మత్తు పదార్థాల రవాణా, క్రికెట్ బెట్టింగ్‌లు, జూదం, కోడి పందాలపై ప్రత్యేక నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.