VIDEO: సుగవాసి ప్రసాద్ బాబుకు గజమాలతో ఘనస్వాగతం
అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం చింతమడెం మండలంలో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో, పూలవర్షంతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి 'జై హో టీడీపీ' నినాదాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తలకు అండగా ఉంటానని సుగవాసి భరోసా ఇచ్చారు.