VIDEO: మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం
BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మనపాలెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బొల్లవరప్పాడు గ్రామానికి చెందిన అశోక్‌తో పాటు వెనక కూర్చున్న మరో మహిళ నాగమణికి గాయాలు అయ్యాయి. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.