చెన్నూరులో ఘనంగా 'హనుమాన్ స్వాముల భిక్ష' కార్యక్రమం

చెన్నూరులో ఘనంగా 'హనుమాన్ స్వాముల భిక్ష' కార్యక్రమం

MNCL: చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో 18వ వార్డ్ కౌన్సిలర్ ఎతం శివ కృష్ణ గురువారం హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 600 మంది స్వాములు ఒకేసారి భిక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శివకృష్ణ మాట్లాడుతూ.. గతేడాది లాగే ఈసారి కూడా భిక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములకు మరియు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.